అశువులు బాసిన నాలో ఆశువుకి
ఆశ పోద్దామని ఒకనాడు తటాకానికి చేరా
కదులుతున్న చేపల కోలాహలం
పదిలెస్తూ ఎగురుతున్న కెరటాల కుతూహులం
పురివిప్పిన పున్నమి నాట్యం
గగనం లో మేఘనాధుని విన్యాసం
నేను చూసిన మొదటి దృశ్యం
లోతుల్లో దాగున్న మాటల మూటలు
తవ్వుదామని తవ్వకాలు మొదలు పెట్టా
ఇంతలో ఎదకి చేరువుగా
మట్టిపట్టిన గుహ ఒకటి కనిపించింది
పూడుకుపోతున్న ఆ గుహని చూసి విగతనయ్యా
గుహని తవ్వడం మొద లుపెట్టా
నానిపోయిన నన్నయ్య పదవిన్యాసాలు
రాళ్ళు గా మారిన రమణీయ కావ్యాలు
బూజుపట్టిన బుజ్జుగాడి హాస్యాలు
గురుతులు పోతున్న గురజాడ జాడలు
శిలాజాలైన నాభాష ఆనవాళ్ళు
నాకుదోరికిన మొదటి రత్నాలు
గోతుల లోతులు పెరిగాయి
యదలోయల గోడలు పగిలాయి
యమాత రాజభానసలు
ఎడతెరగని సంధులు సమాసాలు
తెలుగు గురువుగారి తియ్యని పద్యాలు
అమ్మనేర్పిన సుమతి శతకాలు
నాకు మిగిల చివరి ఆస్థి పాస్థులు
ఆసువుని బ్రతికించానో లేదో తెలియదు కాని
భాషని బ్రతికించుకోగలిగా
తటాకానికి కృతఙ్ఞతలు చెప్పి
తీపి జ్ఞాపకాలతో వెనుదిరిగా
మాతృభాష అమ్మవంటిది
దాన్ని మరువడమంటే అమ్మను మరిచినట్టే
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment