Thursday, 7 January 2010

ఆస్వాదించా!!

అందే ఆకారంలో వున్న ఆ భవనాన్ని చీల్చుతుంటే మనసు పులకరించింది.
గోపురం పగలకొట్టకుండా చీల్చడం భవనానికి కొత్త అందాల్ని ఇచ్చింది.

గుండ్రటి వింజామరలు, ధవళ కాంతులు భవనాన్ని చీల్చుతూ బయటకు రాసాగాయి,
జలంలేని జలరాజంలా జీవకాంతులు వెలువ రించింది

భవనంలో భటులు లేరేమో ప్రశాంతవనంలా గోచరించింది.
భవనాన్ని శోధించాలని మందు గుండుని తయారు చేశా!

నీటి తటాకంలో ఆ భవనాన్ని వాల్చి మందుగుండుని పేర్చా
చీలికలా మధ్య మందుగుండుని చేర్చి తైల సంద్రానికి పయనమయ్యా

గ్రీష్మతాపానికి గురైన సం(ము)ద్రము పరవళ్ళు త్రొక్క సాగింది
ఇంతలొ నా అందమైన భవనం నా చేజారి తైల సంద్రంలో జలకా లాడింది.

చైత్ర చినుకులు గ్రీష్మాన్ని వరించాలని ఉవ్విళ్ళూరుతూ భువికి చేరాయి
చినుకుల అలజడితో గ్రీష్మతాపం ఆవిరి ముత్యాల వానై భవనాన్ని తాకింది

భవనాన్ని నెమ్మదిగా బయటకు దించా, పేలని మందుగుండుని చూచి ఆశ్చర్యపడ్డా
ఇంతలో అమ్మ నిద్రలేపి, అన్నం వొడ్డించానంది.

కంచం లో ఆ చిన్న చిన్న ఆ భవనాలను చూచి విస్తు పోయా!
నిజమైన కలని చూసి నేవ్వెర పోయా.

నీను కలలో చేసింది గుత్తి వంకాయ కూర అని గ్రహించా ,
క్షణం నిలువక కంచం లోని ఆ కూరను అమాంతం ఆస్వాదించా!!


ఆంధ్రుల గుత్తి వంకాయ కూరకు ఎంత వాయాసో కానీ ,
అజరామారమైన ఆ వంటకం జిహ్వకు ఎప్పుడూ ప్రీతి పాత్రమే!
ఆ కూర మీద ఉన్నమమకారం కొద్ది ఈ నా చిన్న ప్రయత్నం !!!

1 comment: