Sunday, 26 February 2012

కొమ్మ కొమ్మల సాగే

కొమ్మ కొమ్మల సాగే కోకిలమ్మ స్వరాలూ
రెమ్మ రెమ్మల నడుమ తీయ్యనైన పదాలూ కొమ్మ కొమ్మల

వసంతుని రాకతో వికసించిన నందన వనము
మల్లెలమ్మ ఘుమ ఘుమ తో పూరివిప్పిన ప్రకృతి గళము
జాబిల్లమ్మ పల్లవి తో , వెన్నలమ్మ సవ్వడి తో
స్వాగతం పలికింది చైత్రమాసాగమనం ||కొమ్మ కొమ్మల||

నిస నిస పని సని.. ప..మ గమప గమప గమప..
నిస నిస పని సని.. ప..మ గమప గమప గమప..

మావి చిగురు తిన్ననాటి కొత్త కోయిలమ్మకు ,
పొంగి పొరలు కొత్త సొగసుల చీనాంబరి చిందులకు ,
పులకించిన మనసుతో ,నిండిన స్వరాలతో
స్వాగతం పలికింది చైత్రమాసాగమనం ||కొమ్మ కొమ్మల||

జన్మభూమి జన్మభూమి

జన్మభూమి జన్మభూమి జన్మభూమి ,ఇది పవిత్ర భూమి , మాతృ భూమి
మమతలకు నిలయమై , ఐక్యతకు ఆదర్శమై
నిలచినదీ భూమి , వెలసిన భూమి జన్మభూమి

మానవ సేవే మాధవ సేవని , నమ్మిన భూమి , చూపిన భూమి
అర్పణ చేసే సమయమిది , ఋణం తీర్చికొనే తరుణమిది జన్మభూమి

చేయి చేయి కలుపుతూ ప్రగతి కి నాన్దిడుతూ ,
భుజం భుజం కలుపుతూ , భవితకు బాటిడుతూ
జన్మభూమి స్పూర్తు బూని అందరమూ కలసి ,
సాధిద్దాం ప్రగతిని ముందడుగేసి జన్మభూమి

కులం మరచి , బలం మరచి , జాతి భేదం విడచి
స్రామికులై శ్రమతో , శ్రమదానం చేసి
నీది అని , నాది అని స్వార్ధమును విడచి
గెలిపిద్దాం జగతిని అందరమూ కలసి జన్మభూమి


(Winner of state level singing competition 1996 , composed & written by swathi akella)

లత వై నాకు జత వై

ఆకాశ వీధి లోన , వెన్నెల పూల లత వై
లత వై నాకు జత వై , నా కవిత ప్రాణ గీతిక వై

నీ గానమే మృదుల గానమై , ఊయలూగ సాగే
నీ నాట్య మే ప్రణవ నాట్య మై సదా విరులు కురియ సాగే ||ఆకాశ||

నీ కురుల సోయగాలే నీలి మేఘపు ఛాయలై
నా కవితా వేసపు ఝల్లు లై , రస మాధురి వెల్లువలై ||ఆకాశ||

నీ అందెల సవ్వడులే సిరి విల్లై విరిసే
నా పద సాహితి నవనికేతన రాగమే హరి విల్లై విరిసే ||ఆకాశ||
(Composed & Written by Swathi Ramalakshmi Akella)